: రాజ్ నాథ్ జమ్మూకాశ్మీర్ పర్యటన రద్దు


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన జమ్మూకాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రాజ్ నాథ్ రేపు, ఎల్లుండి జమ్మూకాశ్మీర్లో పర్యటించాల్సి ఉంది. సరిహద్దుల వద్ద భద్రత, అక్కడి గ్రామాల్లో ప్రజల పరిస్థితి వంటి అంశాలపై తన పర్యటనలో సమీక్షించాలని కేంద్ర హోం మంత్రి భావించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ, రాష్ట్రంలో భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్ నాథ్ సింగ్ పర్యటనను రద్దు చేసుకున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ప్రకటించింది.

  • Loading...

More Telugu News