: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులకు ఉచితంగా 'మేరీ కోమ్' టికెట్లు


భారతీయ జనతా పార్టీ ప్రతి అంశాన్ని తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగించుకుంటుంది అనడంలో సందేహం లేదు. త్వరలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు (డియుఎస్ యు) జరగనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం 'మేరీ కోమ్' టికెట్లను ఉచితంగా విద్యార్థులకు ఇవ్వనుంది అక్కడి బీజేపీ శాఖ. ఇందుకోసం టికెట్లు పొందగోరే విద్యార్థుల డేటాబేస్ ను సిద్ధం చేయనుంది. దీని ద్వారా యువ ఓటర్లను ఆకర్షించి, వారి మద్దతు పొందవచ్చని ఆలోచన చేస్తోంది. ఒక్క డియుఎస్ యు ఎన్నికలే గాక, ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలు జరిగితే అక్కడా లాభపడవచ్చన్నది బీజేపీ ప్లాన్. అటు, బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఒక మహిళా బాక్సర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా కాబట్టే టికెట్లను ఇస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News