: ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని కేసీఆర్ కూడా అన్నారు: అసెంబ్లీలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని కేసీఆర్ కూడా తనతో అన్నారని చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని... తన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని చంద్రబాబు అన్నారు. అయితే, విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో చిక్కుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.