: ఆనాటి 'కర్నూలు రాజధాని' సంగతులను వివరంగా చెప్పిన చంద్రబాబు


వైసీపీ చెబుతున్నట్లుగా 1953లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరగలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అప్పుడు రాజధాని విషయాన్ని ప్రకాశం పంతులు ఇంట్లో కూర్చుని చర్చించారని ఆయన అన్నారు. ఆ సమయంలో రాజధాని విషయంలో రకరకాల డిమాండ్లు వచ్చాయని ఆయన అన్నారు. కొంతమంది విశాఖపట్నం సుందర నగరం కాబట్టి దానిని రాజధానిని చేయాలని డిమాండ్ చేశారని... అలాగే, కమ్యూనిస్టులు విజయవాడ-గుంటూరును రాజధాని చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మరి కొంతమంది నాయకులు కడపను రాజధాని చేయాలని కోరారని చెప్పారు. అలాగే శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ నాయకుడు గౌతు లచ్చన్న తిరుపతిని రాజధాని చేయాలని కోరారని ఆయన పేర్కొన్నారు. ఇలా అందరి మధ్య ఏకాభ్రిప్రాయం కుదరకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అందరినీ సాయంత్రం మూడుగంటలకు తన ఇంటికి రావాలని ఆహ్వానించారని చంద్రబాబు తెలిపారు. అన్ని పార్టీల సభ్యులు తన ఇంటికి వచ్చిన తర్వాత గౌతు లచ్చన్న గారిని పెన్ను, పేపరు తీసుకోమని చెప్పి... టకాలున రాజధానిగా కర్నూలు పేరు రాయమని ప్రకాశం పంతులు ఆదేశించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కర్నూలును ఈ విధంగా రాజధానిగా ఎంపిక చేశారని తెలిపారు. కర్నూలును రాజధానిగా శాసససభలో నిర్ణయించలేదని... అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఇంట్లో నిర్ణయించారని చంద్రబాబు వివరంగా చెప్పారు.

  • Loading...

More Telugu News