: 'ఐఎస్ఐఎస్' కు సవాల్ విసిరిన అమెరికన్ జర్నలిస్టు కుటుంబం


అమెరికా పాత్రికేయుడు స్టీవెన్ సాట్లాఫ్ ను ఐఎస్ఐఎస్ గ్రూపు అత్యంత కిరాతకంగా చంపేయడంపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగడం తెలిసిందే. ఈ క్రమంలో సాట్లాఫ్ కుటుంబ సభ్యులు ఐఎస్ఐఎస్ నేతకు సవాల్ విసిరారు. శాంతిని బోధిస్తుందని చెబుతున్న ఖురాన్ విషయంలో తమతో చర్చకు రావాలని వారు పేర్కొన్నారు. సాట్లాఫ్ 'సహృదయుడు' అని అతని కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. సాట్లాఫ్ కుటుంబం తరపున, అతని మిత్రుడు బరాక్ బర్ఫీ మాట్లాడుతూ, సాట్లాఫ్ రెండు ప్రపంచాల నడుమ నలిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అరబ్ ప్రపంచం అతన్ని చిదిమేసిందని పేర్కొన్నాడు. స్టీవ్ యుద్ధ పిపాసి కాడని, అతను అభాగ్యుల గొంతుకను బయటి ప్రపంచానికి వినిపించాలనే భావించాడని బర్ఫీ వివరించాడు. ఇస్లామిక్ స్టేట్ అధినేత అబు బకర్ అల్-బాగ్దాదీ తమతో చర్చకు రావాలంటూ బర్ఫీ సవాల్ విసిరాడు. "రంజాన్ ను కరుణాత్మక మాసంగా పేర్కొంటారు కదా! మరి, ఏమైంది మీ కరుణ?" అని ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News