: వైసీపీ నేతలు భూములు ఎక్కడ కొంటే అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం కుదరదు: అచ్చెన్నాయుడు
వైసీపీ సభ్యుల ఆందోళనపై సభలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిస్పందించారు. వైసీపీ నాయకులు భూములు ఎక్కడ కొంటే అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు కావాలనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ కావాలో ప్రతిపక్ష నేత సభలో చెప్పాలని... అంతేకానీ, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇప్పటికే జగన్ వల్ల తెలుగుప్రజలు అనేక అవమానాలకు గురయ్యారని ఆయన ఆరోపించారు.