: బాలీవుడ్ మూవీ ఆడియో లాంచ్ లో బ్లూఫిల్మ్ ప్రత్యక్షం!


చలన చిత్రాల ఆడియో లాంచ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్న రోజులివి. అయితే ‘దేశీ కత్తే’ ఆడియో లాంచ్ కు హాజరైన ఆహూతులు నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే, ఆడియా లాంచ్ లో భాగంగా ఆడియో విజువల్స్ మధ్యలో ఓ బూతు చిత్రం ప్రదర్శితమైంది. కేవలం కొన్ని సెకన్ల పాటే సదరు బ్లూఫిల్మ్ కనిపించినా, దీనిపై అక్కడ కలకలం రేగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై మిడ్-డే పత్రిక వార్త రాసింది. ఆడియో విజువల్స్ ప్రదర్శనను పర్యవేక్షిస్తున్న ఓ టెక్నికల్ ఇంజినీర్ చేసిన పొరపాటు కారణంగానే ఈ అపశ్రుతి చోటుచేసుకుందన్న చిత్ర దర్శక, నిర్మాతలు, సదరు ఘటనతో తాము కూడా షాక్ కు గురయ్యామని చెప్పారు. అయితే తనకేమీ తెలియదని సదరు టెక్నికల్ ఇంజినీర్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News