: ‘కరెంట్ తీగ’ సినిమా టీజర్ విడుదల
మంచు మనోజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కరెంట్ తీగ’ టీజర్ ఇవాళ విడుదలైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డాక్టర్ మంచు మోహన్ బాబు సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ఈ సినిమాకు నిర్మాత. మంచు మనోజ్ సరసన హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ నటించారు. జగపతిబాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.