: శ్యామ్ సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫ్యాబ్లెట్ ఆవిష్కరణ
ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ శ్యామ్ సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫ్యాబ్లెట్ ను ఆవిష్కరించింది. జర్మనీలోని బెర్లిన్ లో ఐఎఫ్ఏ టెక్ ఎక్స్ పో లో గెలాక్సీ నోట్ 4ను విడుదల చేసింది. దీనిలో 5.7 అంగుళాల హెచ్ డీ అన్ మోల్ డిస్ ప్లే, రెండు కెమెరాలు వున్నాయి. వెనుకది 16 మెగా పిక్సెల్ కెమెరా కాగా, ముందుది 3.7 మెగాపిక్సెల్ కెమెరా. సెల్ఫీల కోసం ముందు కెమెరాకు 90 డిగ్రీల యాంగిల్ తో పాటు 120 డిగ్రీల యాంగిల్ సదుపాయం ఉంది. దీనిలో ఓఎస్ ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ వినియోగించారు. 4 జీబీ ర్యామ్ ఉంటుంది. మెమరీ విస్తరించుకునే వెసులుబాటు ఉంది. 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.