: లవ్ జీహాద్...వివాహితపై డాక్టర్ అత్యాచారం
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో లవ్ జీహాద్ దుమారం ఆగడం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఓ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ముజఫర్ నగర్ దగ్గర్లోని మీరన్ పూర్ లో అబ్దుల్ కలాం అనే డాక్టర్ 32 ఏళ్ల వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత బలవంతంగా ఆమె మతం మార్చేందుకు ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టరును అరెస్టు చేశారు. ఆమె మతం మార్చడానికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.