: చాలా తప్పులు చేశా...చేసిన ప్రతిసారి బాధపడ్డా: జేలో


వ్యక్తిగత జీవితంలో చాలా తప్పులు చేశానని అమెరికా గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మూడు పెళ్లిళ్లు విచ్ఛిన్నం కావడం, ఓ నిశ్చితార్థం పెళ్లి పీటలెక్కకపోవడానికి తోడు ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ దూరం కావడం జెన్నిఫర్ కు వేదనను మిగిల్చాయి. దీంతో ప్రేమ విషయంలో తాను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన తప్పులు మరోసారి పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపారు. తాను చాలా తప్పులు చేశానని అందరికీ తెలుసని, పొరపాటు చేసిన ప్రతిసారి చాలా బాధపడ్డానని ఆమె అన్నారు. మరోసారి ఇలాంటి తప్పులు చేయరాదని గట్టిగా నిర్ణయించుకున్నారు. తన పిల్లలు తండ్రి లేనిలోటు అనుభవిస్తున్నారన్న విషయం తనకు తెలుసు కనుక, వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని జెన్నిఫర్ తెలిపింది.

  • Loading...

More Telugu News