: క్యాట్ లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన కేంద్రం
క్యాట్ లో కేవియట్ పిటీషన్ ను కేంద్రప్రభుత్వం దాఖలు చేసింది. అఖిల భారత సర్వీస్ అధికారుల పంపకాల నేపథ్యంలో కేంద్రం ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అధికారుల పంపకాల్లో జాప్యం నివారణకు ఈ పిటీషన్ ను కేంద్రం దాఖలు చేసింది. అధికారుల పంపకాల్లో ఎలాంటి మార్పులు ఉండవని ప్రత్యూష్ సిన్హా కమిటీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఏ అధికారి అయినా తనకు అన్యాయం జరిగిందని భావిస్తే ప్రక్రియ ఆగకుండా ఉండేందుకు కేంద్రం ముందు జాగ్రత్తగా ఈ పిటిషన్ వేసింది.