: లవర్ తో ఉండగా అరెస్టయిన పాప్ స్టార్


వివాదాల పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 29న అమెరికాలోని స్టార్ ఫోర్డ్ లో ఓ మినీ వ్యాన్ ను బీబర్ కారుతో ఢీ కొట్టాడు. తరువాత కారుదిగి 'అడ్డం వస్తావా?' అంటూ వ్యాన్ డ్రైవర్ని కొట్టాడు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కెనడాలోని టొరెంటోలో ప్రేయసి, పాప్ స్టార్ సెలెనా గోమెజ్ తో డేటింగ్ చేస్తుండగా రంగప్రవేశం చేసిన పోలీసులు బీబర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, సెప్టెంబర్ 29న కోర్టుకు హాజరవుతానని పోలీసులకు హామీ ఇవ్వడంతో, సొంత పూచీకత్తుపై అతడిని విడుదల చేశారు. బీబర్ కు వివాదాలు కొత్త కాదు. విడుదలైన తరువాత యాక్సిడెంట్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని, ఎవరికీ గాయాలు కాలేదని బీబర్ వ్యాఖ్యానించడం విశేషం.

  • Loading...

More Telugu News