: జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న నరేంద్ర మోడీ
జపాన్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. జపాన్ లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటించారు. ఈ పర్యటనలో భారత్ కు పెట్టుబడులు తేవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. అలాగే ఇరు దేశాల మధ్య క్యోటో-కాశీ ఒప్పందం కుదిరిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ పర్యటన విజయవంతమైందని మోడీ ప్రకటించారు.