: హైదరాబాదు పోలీసు అకాడమీలో మద్యంపై నిషేధం
ఇటీవలో ఓ యువ ఐపీఎస్ ట్రైనీ స్విమ్మింగ్ పూల్లో శవమై తేలిన నేపథ్యంలో... హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీ (ఎస్వీపీఎన్పీఏ)లో మద్యంపై నిషేధం విధించారు. మను ముక్త్ మానవ్ అనే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ట్రైనీ... పార్టీలో మద్యం సేవించి ఆఫీసర్స్ క్లబ్ లోని స్విమ్మింగ్ పూల్లో ఈతకొట్టే క్రమంలో మరణించాడు. ఈ ఘటనను అకాడమీ వర్గాలు చాలా తీవ్రంగా పరిగణించాయి. దీంతో, అకాడెమీలోని ఆఫీసర్స్ క్లబ్ లో మద్యపానం నిషేధించారు. తాజా ఉత్తర్వులు అనుసరించి, అకాడెమీలో జరిగే ఏ అధికారిక కార్యక్రమంలోనూ మద్యానికి చోటివ్వరాదు.