: సీఎం చంద్రబాబుతో ముగిసిన ఆర్టీసీ ఈయూ నేతల చర్చలు


ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆర్టీసీ ఈయూ నేతల చర్చలు ముగిశాయి. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.1500 కోట్లు విడుదల చేయాలని సీఎంను నేతలు కోరారు. అయితే, దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వారికి తెలిపారు. ఆర్టీసీ సొసైటీకి చెల్లించాల్సిన రుణ బకాయిలను కొంతకాలంగా చెల్లించకపోవడంతో కార్మికులకు సొసైటీ రుణాలు ఇవ్వడంలేదు. దాంతో, పలువురు లోన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఆగ్రహించిన కార్మికులు ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామంటూ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News