: గంగానది ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం: కేంద్రం స్పష్టీకరణ


పవిత్ర గంగానది ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు గంగా నది బేసిన్ పరిశుభ్రం చేసే పని నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఐఐటీ నిపుణుల కన్సార్టియంకు అప్పగించనున్నామని, డిసెంబర్ చివరిలోగా వారు నివేదికను సమర్పిస్తారని తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం, గంగా ప్రక్షాళనను జాతీయస్థాయి ప్రాధాన్యతా అంశంగా పరిగణిస్తున్నామని, గంగానది పర్యావరణానికి అవసరమైన చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని తెలిపింది. గంగానది ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవడంలేదని, సరైన రోడ్ మ్యాప్ తో రావాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని కొన్ని రోజుల కిందట ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News