: స్నేక్ గ్యాంగ్ ఎలా ఆపరేట్ చేసేదో తెలుసా!
పైజల్ దయానీకి చెందిన స్నేక్ గ్యాంగ్ కార్యకలాపాలు ఎలాంటివో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. సాధారణంగా హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీ షరీష్ పరిసర ప్రాంతాలు (షహీన్ నగర్,ఎర్రగుంట మొదలైన ప్రాంతాలు) పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. దీంతో సరదాగా ఎంజాయ్ చేద్దామని జంటలు, అమ్మాయిలు సెలవు రోజుల్లో, వీకెండ్ లో ఇక్కడకు విహారానికి వస్తుంటారు. షహీన్ నగర్ లో ఉండే పైజల్ దయానీకి ఈ ప్రాంతంలో ఫుల్ నెట్ వర్క్ ఉంది. ఎవరైనా జంటలు గానీ, అమ్మాయిలుగానీ షహీన్ నగర్ లో... ఆ పరిసర ప్రాంతాల్లో ఎంటర్ అవగానే అనుచరుల నుంచి వెంటనే అతనికి సమాచారం వచ్చేది. వెంటనే పాములను తీసుకుని గుర్రాలమీద, టూ వీలర్స్ మీద స్నేక్ గ్యాంగ్ బయలుదేరి... సదరు స్థలానికి చేరేది. ఇక, ఆ తర్వాత రాయటానికి కూడా వీల్లేని విధంగా అమ్మాయిలను వివస్త్రలను చేసి... వారి మెడ మీద.. మిగతా శరీరభాగాల మీద పాములు వేసి... భయపెట్టి అత్యాచారం జరిపేవారు. దీంతో పాటు ఈ అకృత్యాలను వీడియోగా చిత్రీకరించేవారు. బాధితురాలు పోలీసులకి కంప్లైంట్ చేస్తే... చిత్రీకరించిన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించేవారు. దీంతో, ఈ రాక్షసకాండ గత కొన్నేళ్లుగా జరుగుతున్నా బయటకు రాలేదు. ఇంకో విచిత్రమేమిటంటే, పాతబస్తీలో బాగా ప్రాభవమున్న ఓ పార్టీకి వీరంతా మద్దతుదారులు. దీంతో, ఈ ప్రాంతంలో వీరి ఆగడాలకు ఇన్నాళ్లూ అడ్డుఅదుపు లేకుండా పోయింది. వీరికి ఉన్న రాజకీయ ప్రాబల్యం కారణంగా స్థానికులకు కూడా వీరంటే భయం ఏర్పడింది. దీంతో, స్నేక్ గ్యాంగ్ విషయం తెలిసినా కూడా వారు ఇన్నాళ్లు నోరుమెదపలేదు.