: మోసం చేసిన ప్రియుడిని కొట్టిన ప్రియురాలు
విశ్వాసఘాతకానికి పాల్పడితే పర్యవసానం ఎలా ఉంటుందో విజయవాడలోని పటమటలో ఓ ప్రియుడికి ప్రియురాలు తెలియజెప్పింది. గత కాలంగా ఓ యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారు. ఆ యువతిని గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మాయమాటలు చెప్తున్న యువకుడు, మరో యువతితో ప్రియురాలికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. దీంతో ఆ ప్రియురాలు ఆగ్రహంతో అపర కాళికే అయింది. తన నమ్మకాన్ని వమ్ముచేయడంతో ఆగ్రహంతో ప్రియుడిని పట్టుకుని లెంపలు వాయించింది. చెప్పుతో కొట్టి మరీ బుద్ధి చెప్పింది.