: సింధు విజయానందంలో ఉన్నా... సైనా గొడవెందుకు?: గోపీచంద్
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కోచ్ ను మార్చడంపై వ్యాఖ్యానించేందుకు ఆల్ ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్ నిరాకరించారు. ప్రస్తుతానికి తాను పీవీ సింధు సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. తన శిష్యరికంలో రోజు రోజుకీ పురోగతి సాధిస్తున్న సింధు విజయం సాధించడం తనను అమితానందానికి గురి చేసిందని ఆయన తెలిపారు. సింధు ప్రత్యర్థులను మట్టికరిపించడం వెనుక అంతులేని శ్రమ దాగుందని ఆయన తెలిపారు. రోజు రోజుకీ ఆటలో పురోగతి సాధిస్తున్న సింధు మరిన్ని విజయాలు సాధిస్తుందని గోపీచంద్ ఆకాంక్షించారు.