: పొట్ట పెరిగితే 'పోటు' కూడా పెరుగుతుంది!


మనిషి దేహంలో ఉదరం వద్ద కొవ్వు పేరుకుపోవడాన్ని వైద్యులు రోగ హేతువుగా పరిగణిస్తారు. పొట్ట భాగంలో పొరలు పొరలుగా స్థిరీకరణ చెందే కొవ్వు అనేక వ్యాధులకు కారణమవుతుందని చెబుతారు. దీనిపై యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన అస్లాన్ ట్యూరర్ అనే పరిశోధకుడు ఏం చెబుతున్నారో వినండి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువైతే, అది అధిక రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు. ఒకే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) స్థాయి కలిగిన ఉన్న వ్యక్తులను పోల్చి చూస్తే, ఉదరం చుట్టూ కొవ్వు పేరుకున్న వ్యక్తులకే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేలిందని చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా 903 మంది రోగులను పరిశీలించారు. పొట్ట వద్ద కొవ్వుకు, హై బీపీకి ఉన్న సంబంధం... లింగభేదం, వయసు, జాతి... ఇలా, అన్నింటా ఒకే విధంగా ఉంటుందట.

  • Loading...

More Telugu News