: 'మంగళ్యాన్' ట్రిపుల్ సెంచరీ
భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్) 300 రోజులు పూర్తిచేసుకుంది. ఈ ఆర్బిటర్ మరో 23 రోజుల్లో నిర్దేశిత అంగారక కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ట్విట్టర్ లో పేర్కొంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను గతేడాది నవంబర్ 5న శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి రోదసిలో ప్రవేశపెట్టారు. ఇస్రోకు అత్యంత విశ్వసనీయమైనదిగా పేరొందిన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా మార్స్ ఆర్బిటర్ ను ప్రయోగించారు. రూ.450 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.