: కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు?


ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయం దాదాపు ఖరారైనట్టే. అయితే, ఇప్పుడు మరో అంశం తెరపైకి తెచ్చారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. నూతనంగా నిర్మితమయ్యే రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరతామని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు ఎంత స్థలం కావాలన్నా ఇచ్చేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. సభాముఖంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. మంగళగిరి వద్ద రాజధాని నిర్మించాలని ఆంధ్రా సర్కారు భావిస్తుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News