: ఊపందుకుంటున్న తాత్కాలిక రాజధాని పనులు
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడ కేంద్రంగా పలు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అన్ని విభాగాల శాఖాధిపతులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కార్యాలయాల ఏర్పాటుకు ఎంత మేర స్థలం అవసరమవుతుందో నివేదికతో కూడిన ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.