: ఎట్టకేలకు సొంత నియోజకవర్గాల పర్యటనలో సోనియా, రాహుల్ గాంధీలు


గడచిన పదేళ్ళూ పార్టీ అధికారంలో ఉండటంతో నిత్యం ఏదో ఒక పని. నిన్నటిదాకా తమకు దక్కాల్సిన పదవులు, కేటాయింపులపై అధికార పక్షంతో తగవులాట. పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఇప్పుడంతా తీరికనే కదా. అందుకేనేమో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె పుత్రరత్నం యువరాజు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గాల పర్యటనలకు మొగ్గు చూపారు. రాయిబరేలీలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోనియా సోమవారమే అక్కడికి వెళ్లిపోయారు. కార్యకర్తలతో పాటు ప్రజలతోనూ ఆమె మమేకమవుతున్నారు. నిన్నటిదాకా కిందిస్థాయి కార్యకర్తలు, ప్రజలతో అంటీముట్టనట్టు వ్యవహరించిన సోనియా, తాజాగా నియోజకవర్గ పర్యటనలో గడపగడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తల్లి పర్యటన కొడుకునూ ఉత్తేజపరిచినట్టుంది. గురువారం నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా గతంలో మాదిరిగా కాకుండా కింది స్థాయి కార్యకర్తలతో మరింత సన్నిహితంగా మెలిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

  • Loading...

More Telugu News