: మోడీ డ్రెస్సులపై శోభాడే వివాదాస్పద వ్యాఖ్యలు
జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ రచయిత్రి శోభా డే వ్యంగ్యంగా కామెంట్ చేశారు. జపాన్ పర్యటనలో నరేంద్రమోడీ మార్చిన దుస్తులపై శోభా డే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యాషన్' చిత్రంలో ప్రియాంక చోప్రా మార్చిన దుస్తుల కంటే... ఎక్కువ డ్రెస్సులు మోడీ జపాన్ పర్యటనలో మార్చారని ట్విట్టర్లో శోభా డే వెటకారంగా ఓ కామెంట్ ను పోస్ట్ చేశారు. దేశ ప్రధాని అయిన నరేంద్రమోడీపై శోభాడే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.