: విజయవాడ చుట్టుప్రక్కలే రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్


ఐదుగంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాజధానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాజధానికి అవసరమైన భూముల కోసం... విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని నిశ్చయించారు. ఈ కమిటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారని సమాచారం. అయితే, ఈ సమావేశ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. రేపు అసెంబ్లీ ఉన్నందున సమావేశ వివరాలను గురించి ఎట్టి పరిస్టితుల్లోను మీడియాకు చెప్పవద్దని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News