: ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
హైదరాబాదులో ఐదు గంటలకు పైగా సాగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రాష్ట్ర రాజధాని ఏర్పాటు పైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సమావేశ వివరాలను గోప్యంగా ఉంచాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రేపు అసెంబ్లీ ఉన్నందున సమావేశ వివరాలను బయటకు వెల్లడించవద్దని మంత్రులకు బాబు చెప్పారు. ఏపీ రాజధాని ఎక్కడన్న దానిపై రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.