: నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. డ్యాం ప్రస్తుత నీటిమట్టం 884.8 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇన్ ఫ్లో లక్షా 95 వేల క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయం నుంచి 4 గేట్లను ఎత్తి లక్షా 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.