: తెలంగాణలోని 100 మండలాల్లో రుణాల రీ షెడ్యూలుకు బ్యాంకర్ల గ్రీన్ సిగ్నల్


ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని 100 మండలాల్లో రుణాల రీ షెడ్యూల్ కు బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ సూచన మేరకు 100 మండలాల్లో రుణాలు రీషెడ్యూల్ చేయాలని బ్యాంకర్లకు ఎస్ఎల్ బీసీ ఆదేశించింది. ఈ నెల 6వ తేదీలోగా మూడు జిల్లాల్లో రుణాల రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రుణమాఫీ భారం తాజా అంచనాల ప్రకారం రూ.17,680 కోట్లు ఉంది. పంట రుణాలపై 4న ప్రభుత్వానికి బ్యాంకర్లు పూర్తి సమాచారం ఇవ్వనున్నారు. 4వ తేదీ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ఈ గ్రామసభల్లో రుణమాఫీ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

  • Loading...

More Telugu News