: ఖాన్ త్రయాన్ని వెనక్కు నెట్టిన అమితాబ్ బచ్చన్!


అభిమాన గణంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు తిరుగులేని సంఖ్యలో అభిమానులున్నారు. ఈ విషయంలో ఖాన్ త్రయాన్ని బిగ్ బి పక్కకు నెట్టారు. ట్విట్టర్లో అమితాబ్ ఫ్యాన్స్ కోటి మందికి పైగానే. ఈ విషయంలో అమితాబ్ తన తర్వాతి తరం బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్ (87 లక్షలు), అమీర్ ఖాన్ (81 లక్షలు), సల్మాన్ ఖాన్ (79 లక్షలు), ప్రియాంక చోప్రా (68 లక్షలు) లను ఎప్పుడో అధిగమించారు. 2010 మేలో ట్విట్టర్లో ఖాతా తెరచిన అమితాబ్... తరచూ ట్వీట్లు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. ట్విట్టర్లో రెండు కోట్ల ఫాలోయర్ల సంఖ్యను దాటడమే తన తదుపరి లక్ష్యమని బిగ్ బి తాజాగా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News