: పద్మశ్రీ బాపుకు అలంకారం అవలేదు, బాపుయే పద్మశ్రీ పురస్కారానికి అలంకారమయ్యారు: చిరంజీవి


చెన్నైలో బాపు భౌతిక కాయానికి చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపు మరణం తెలుగువారందరికీ తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. రామాయణంలో హనుమంతుడి లాంటి వ్యక్తి బాపు అని ఆయన పేర్కొన్నారు. అత్యద్భుతమైన రేఖా చిత్రాలు, కార్టూన్లు, సినిమాల ద్వారా బాపు తెలుగువారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. బాపుకు పద్మ పురస్కారాల విషయంలో చాలా అన్యాయం జరిగిందని చిరంజీవి అన్నారు. ఆయనకు పద్మ పురస్కారం ఎప్పుడో రావాల్సిందని... చాలా ఆలస్యంగా గత ఏడాది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందన్నారు. పద్మశ్రీ బాపుకు అలంకారం అవలేదని... బాపుయే పద్మశ్రీ పురస్కారానికి అలంకారమయ్యారని చిరంజీవి కొనియాడారు.

  • Loading...

More Telugu News