: నాలుగో వన్డేకు సిద్ధమైన ధోనీ సేన... బర్మింగ్ హాంలో రేపు మ్యాచ్
వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు ఇంగ్లండ్ తో నాలుగో వన్డేకు సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్, రేపటి వన్డేను గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే బర్మింగ్ హాంలో జరగనుంది. ఈ సిరీస్ లో తొలి వన్డే వర్షార్పణం కాగా, ఆ తర్వాత కార్డిఫ్, నాటింగ్ హాం వన్డేల్లో టీమిండియా జయభేరి మోగించింది.