: వైన్ గుండెకు మేలు చేస్తుంది, అయితే..!


హై ప్రొఫైల్ పార్టీల్లో వైన్ సర్వసాధారణం. దీన్ని ఆరోగ్య ప్రదాయనిగానూ భావిస్తారు (మితంగా పుచ్చుకుంటేనే). వైన్ ఉపయోగాలపై అధ్యయనం చేపట్టిన చెక్ రిపబ్లిక్ కు చెందిన ప్రొఫెసర్ మిలోస్ తాబోర్ స్కీ దీనిపై పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. రోజూ వైన్ తీసుకుంటే గుండెకు మేలు చేస్తుందని వెల్లడించారు. అయితే, ప్రతిరోజూ వ్యాయామం చేస్తేనే వైన్ ప్రభావం గుండెపై సానుకూలంగా ఉంటుందని, లేకుంటే, నిరుపయోగమేనని వివరించారు. తమ పరిశోధనల్లో రెడ్ వైన్, వైట్ వైన్ రెండూ ఒకే ఫలితాలను ఇచ్చాయని పేర్కొన్నారు. వైన్ సేవించడం ద్వారా... శరీరంలో మంచి కొలెస్ట్రాల్ గా పేర్కొనే హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్ డీఎల్) స్థాయి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. తద్వారా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందట. రోజూ కసరత్తులు చేస్తున్నప్పుడు మాత్రమే హెచ్ డీఎల్ పెరుగుదల సాధ్యమవుతుందని తాబోర్ స్కీ అంటున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ఈఎస్సీ) 2014 మహాసభల్లో ఆయన ఈ విషయాలు తెలిపారు.

  • Loading...

More Telugu News