: భారత్ లో భారీ పెట్టుబడులకు జపాన్ అంగీకారం
వచ్చే ఐదు సంవత్సరాల్లో భారత్ కు ఆర్ధిక, సాంకేతిక సహాయం చేసేందుకు జపాన్ అంగీకరించింది. ఈ మేరకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకొచ్చింది. ఆ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జపాన్ ప్రధాని, ప్రైవేటు పెట్టుబడిదారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 35 బిలియన్ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను జపాన్ పెట్టనుంది. ఇందులో భాగంగా భారత్ లో బుల్లెట్ రైళ్లకు, గంగానది ప్రక్షాళనకు ఆ దేశం ఆర్థిక సాయం చేస్తుంది.