: ఆంధ్రావారిని తిట్టి పబ్బం గడుపుకుంటున్నారు: టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్


టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ నేత జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు ఆంధ్రావారిని తిట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను టీఆర్ఎస్ సర్కారు అవాస్తవాలతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఇక, హరీశ్ రావుకు తన పేరు జపించందే రోజు గడవదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం బీజేపీ తీర్మానం చేసిన నాటికి హరీశ్ చిన్నపిల్లవాడని అన్నారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని జగ్గారెడ్డి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పుట్టిన వెంటనే తెలంగాణ ఉద్యమంలోకి దూకినట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News