: సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే తలసాని
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. ఆయనతో పాటు ఐడీహెచ్ కాలనీవాసులు కూడా సీఎంను కలిశారు. తలసాని టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లనున్నారన్న వార్తల నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడిన నేపథ్యంలో, తలసాని కూడా అదే బాట పడితే మాత్రం తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టిదెబ్బ అనే చెప్పాలి.