: 'మ్యూజిక్ టీచర్' అవతారమెత్తిన మోడీ


జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. చిన్నాపెద్దా, హోదా... ఏదీ పట్టించుకోకుండా అందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తూ, హృదయాలను గెలుచుకుంటున్నారు. తాజాగా, ఆయన టోక్యోలోని 136 ఏళ్ళ పురాతన పాఠశాల 'తైమీ'లో సంగీత శిక్షకుడి అవతారమెత్తి పిల్లలను అలరించారు. క్లాస్ రూంలోకి ప్రవేశించగానే చిన్నారులు ఆయనకు అభివాదం తెలిపారు. సాక్షాత్తూ భారతదేశ ప్రధాని తమకు గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు రావడంతో ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా మోడీకి వారు జపాన్, భారత్ జాతీయ పతాకాలతో స్వాగతం పలికారు. అంతకుముందు, ఆదివారం నాడు ఆయన క్యోటో నగరంలోని సుప్రసిద్ధ కింకాకు-జి బౌద్ధ ఆలయాన్ని దర్శించారు. అక్కడి ప్రధాన మతగురువుతో ఉత్సాహంగా గడిపారు.

  • Loading...

More Telugu News