: మా అనుబంధం మరువలేనిది... భారతీయతను చాటారు: సింగీతం
ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు బాపు పార్థివదేహాన్ని చివరిసారి దర్శించేందుకు తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన సందర్భంగా ఆవేదనకు గురయ్యారు. తమ మధ్య వృత్తిపరమైన సంబంధం కంటే వ్యక్తిగత అనుబంధం ఎక్కువని ఆయన తెలిపారు. బాపు ప్రతిభను యానిమేషన్ రంగం ఉపయోగించుకోలేకపోయిందని సింగీతం అభిప్రాయపడ్డారు. చిత్రకారులపై సహజంగానే పాశ్యాత్య ముద్ర పడుతుందని, కానీ, బాపు విషయంలో మాత్రం అలాంటిది లేదని, ఆయన చిత్ర శైలి పూర్తి సంప్రదాయబద్ధంగా భారతీయతను చాటుతుందని ఆయన అన్నారు. బాపు శైలిని భారతీయ యానిమేషన్ రంగం వినియోగించుకుంటే మనకంటూ గుర్తింపు ఉంటుందని ఆయన సూచించారు.