: బాపు మృతి తెలుగు కళకు తీరని లోటు: రోశయ్య
ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తమిళనాడు గవర్నర్ రోశయ్య తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్రలేఖన, చలన చిత్ర రంగాలకు బాపు మృతి కోలుకోలేని దెబ్బ అని అన్నారు. బాపు 'బొమ్మ' లేని తెలుగింటికి పరిపూర్ణత రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు లోగిలిలో ఆడపిల్ల పుడితే బాపు బొమ్మ పుట్టిందని మురిసిపోతారని ఆయన అన్నారు. బాపు మృతికి తన సంతాపం తెలిపారు.