: స్నేక్ గ్యాంగ్ లైంగిక దాడుల వీడియోలు ప్రసారం చేసిన టీవీపై కేసు


హైదరాబాదు పాతబస్తీలోని పహడీషరీఫ్ లో పాములతో బెదిరించి పలువురిపై అత్యాచారాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ వీడియోలను ప్రసారం చేసిన మెగా టీవీ ఛానెల్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేక్గ్యాంగ్ లైంగిక దాడులకు పాల్పడుతూ తీసిన వీడియో క్లిప్పింగ్స్ ను మెగా టీవీ ఛానల్ ప్రసారం చేసింది. ఈ వీడియో క్లిప్పింగ్స్ "వాట్సప్"లో పంపినా కూడా కేసులు నమోదు చేస్తామని డీసీపీ జానకి తెలిపారు. స్నేక్ గ్యాంగ్ లైంగిక దాడి దృశ్యాలు ఎవరి ఫోన్లో ఉన్నా వెంటనే డిలీట్ చేయాలని ఆమె సూచించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎవరు పంపించారు? ఎవరెవరికి చేరాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు ఆమె చెప్పారు. ఈ వీడియోలకు సంబంధించిన ఏ సమాచారం తెలిసినా పోలీసులకు తెలిపి సహకరించాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News