: పారిశ్రామికవేత్తల సమావేశంలో హిందీలో ప్రసంగించిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన హిందీలో ప్రసంగించారు. క్లుప్తంగా ప్రసంగించిన ఆయన జపాన్ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిని కొనియాడారు. జపాన్ పారిశ్రామికవేత్తల సమర్థతను, ముందుచూపును, అక్కడి శ్రామిక శక్తిని ఆయన ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. పారిశ్రామిక సంబంధాలను దృఢతరం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.