: చౌకబారు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: బొత్సకు దేవినేని హెచ్చరిక


రాజధాని విషయంలో చౌకబారు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను మంత్రి దేవినేని ఉమ హెచ్చరించారు. నందిగామలో ఆయన మాట్లాడుతూ, ఇంకా రాజధాని ఏర్పాటు చేయకుండానే ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రాజధానిని నిర్ణయించే ఏక పక్షనిర్ణయం తీసుకునే స్వభావం ముఖ్యమంత్రిది కాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఏక పక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న నేతల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News