: కార్యకర్తల ఎదుట కన్నీళ్ళు పెట్టుకున్న తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తల సమావేశంలో భావోద్వేగాలకు గురయ్యారు. కార్యకర్తల ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో తుమ్మల సత్తుపల్లిలో సమావేశం నిర్వహించారు. ప్రజల కోరిక మేరకే తాను టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలిపారు. కాగా, ఇటీవలే తుమ్మల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందతుండగా, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆయనను పరామర్శించారు కూడా. డిశ్చార్జి అయిన కొన్ని రోజులకే తాను పార్టీ మారనున్నట్లు తెలిపారు.