: బాపు ఎప్పుడూ కూల్ గా ఉండేవారు: మురళీమోహన్
విలక్షణ దర్శకుడు బాపు అస్తమయం చెందడం పట్ల నటుడు మురళీమోహన్ స్పందించారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాపు ఎప్పుడూ కూల్ గా ఉండేవారని, ఎవరిపైనా చిర్రుబుర్రులాడడం, చికాకుగా కనిపించడం తాను చూడలేదని తెలిపారు. పనిపట్ల అపార శ్రద్ధాసక్తులు ఆయన సొంతం అని చెప్పారు. ఆయనతో తాను పలు చిత్రాలు చేశానని, ఇప్పుడీ వార్త వినడం బాధాకరమని అన్నారు.