: బాపు కన్నుమూతపై బ్రహ్మానందం స్పందన
ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూయడంపై హాస్యనటుడు బ్రహ్మానందం స్పందించారు. ఆయన ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన చిత్రలేఖన ప్రతిభకు హాలీవుడ్ లో అయితే బ్రహ్మరథం పట్టి ఉండేవారని బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. బాపు నిగర్వి అని కొనియాడారు.