: ప్రముఖ దర్శకుడు బాపు అస్తమయం


ప్రముఖ దర్శకుడు బాపు మరిలేరు. ఆయన ఈ సాయంత్రం 5 గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాపు తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రసీమలో తమదైన ముద్ర వేసిన దర్శకుల్లో బాపు ఒకరు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. బాపు 1933 డిసెంబర్ 15న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కంతేరు. ఆయన తొలి చిత్రం సాక్షి (1967) కాగా, చివరి చిత్రం శ్రీరామరాజ్యం (2011). దర్శకుడిగా రెండు జాతీయ అవార్డులు, ఐదు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఆయన రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు అందుకున్నారు. మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణతో ఆయన ప్రస్థానం అందరికీ తెలిసిందే. బాపు చిత్రకారుడిగానూ, కార్టూనిస్టుగానూ ఎంతో ప్రసిద్ధికెక్కారు. 2013లో ఆయనకు కేంద్రం పద్మశ్రీ ప్రదానం చేసింది. 1991లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

  • Loading...

More Telugu News