: నేను మోడీ... మీరు మోరి!: ప్రధాని హాస్యచతురత


భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడంలో దిట్ట! హాస్యం పాళ్ళు ఎక్కువే ఆయనలో. అవసరమైనప్పుడు కాఠిన్యం ప్రదర్శించినా, సరదాగా ఉండడానికి ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆదివారం నాడు క్యోటో నగరంలోని ఓ బౌద్ధ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి ప్రధాన మతగురువు యాసు నగమోరి (83)తో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా మోడీ పరిచయ వచనాల్లో భాగంగా, "నేను మోడీ... మీరు మోరి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో, అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కాగా, ఈ ఆలయాన్ని 1397లో నిర్మించారు. దీన్ని కింకాకు-జి ఆలయం అని పిలుస్తారు. మోడీ తన క్యోటో పర్యటనలో భాగంగా 57 మీటర్ల ఎత్తున్న తోజి ఆలయాన్ని కూడా సందర్శించారు.

  • Loading...

More Telugu News