: అజ్జూ భాయ్ రికార్డు సమం చేసిన ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్ కెప్టెన్ గా, అజారుద్దీన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్ తో శనివారం జరిగిన వన్డే ద్వారా ధోనీ కెప్టెన్ గా 90వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అజ్జూ 174 మ్యాచ్ లలో 90 విజయాలు సాధించగా, ధోనీ 161 మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, వన్డేల్లో 100 విజయాలు సాధిస్తే, ఆ ఫీట్ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్ గా ఈ జార్ఖండ్ డైనమైట్ రికార్డు పుటలకెక్కుతాడు.