: అమ్మాయిలు అలా... అబ్బాయిలు ఇలా..!


రోజులు మారాయి! ల్యాండ్ ఫోన్లు, ఉత్తరాలకు కాలం చెల్లి ఎంతో కాలం అయింది. ఇప్పుడంతా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ట్యాబ్ ల హవా నడుస్తోంది. చీమ చిటుక్కుమన్నా, దాని ప్రతిధ్వని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక, సమాచారం అయితే, క్షణాల్లో అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు ప్రయాణిస్తోంది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఎవరు మాత్రం 'పాత'వైపు మొగ్గుచూపుతారు. అమ్మాయిలైతే ఎస్సెమ్మెస్ లు, అబ్బాయిలైతే ఫేస్ బుక్ కు అతుక్కుపోతున్నారట. ఓ అధ్యయనం చెబుతున్న వాస్తవమిది. అమ్మాయిలు సామాజిక సంబంధాలు, సన్నిహిత సంబంధాల పెంపుదల కోసం టెక్ట్సింగ్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారట. కాలేజీ విద్యార్థినులు రోజుకు సగటున పది గంటలు సెల్ ఫోన్లతోనే కాలం గడుపుతున్నారని బేలర్ యూనివర్శిటీ అనుబంధ సంస్థ హాన్కామెర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన జేమ్స్ రాబర్ట్స్ అంటున్నారు. ఇక, అబ్బాయిల విషయానికొస్తే వారు ఎక్కువగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లు చూస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా, అబ్బాయిలు ఫేస్ బుక్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అధ్యయనం చెబుతోంది. 164 మంది కాలేజీ విద్యార్థులపై ఆన్ లైన్ సర్వే ఆధారంగా ఈ విషయాలు తెలిపారు.

  • Loading...

More Telugu News